సంగారెడ్డి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డివో వెంకటేశ్వర్లు అన్నారు. టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను సంగారెడ్డిలోని కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పదవ తరగతిలో మంచి ఫలితాలు వచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి రామచందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మయ్య యాదవ్, రాష్ట్ర కౌన్సిలర్లు సంజీవయ్య, రాజారెడ్డి, భాస్కర్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్