సంగారెడ్డి: టిపిటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టీపిటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సంఘ భవనం వద్ద జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ శుక్రవారం జెండాను ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వై అశోక్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచందర్, నాయకులు సంజీవయ్య, అశోక్ కుమార్, ప్రశాంతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్