పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఉద్యోగులకు ఈనెల 5వ తేదీన డివిజన్ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావిణ్య బుధవారం తెలిపారు. సంగారెడ్డి, ఆందోల్, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉదయం 10 గంటలకు ఈ శిక్షణ ప్రారంభమవుతుంది. ఎన్నికల ప్రక్రియపై ఉద్యోగులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.