సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం ఉత్తరా నక్షత్ర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు రాఘవేంద్రరావు జోషి స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీసీ కృష్ణమూర్తి గురుస్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం జరిగింది. గురుస్వాములు పాడిన పాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.