సంగారెడ్డి సమగ్ర శిక్ష కార్యాలయంలో కస్తూరిబా ఉద్యోగాల కోసం 1: 1 సర్టిఫికెట్ వెరిఫికేషన్ సోమవారం నిర్వహించారు. జిల్లా బాలికల అభివృద్ధి అధికారి సుప్రియ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 11 మంది నూతన సిబ్బందిని కస్తూర్బా పాఠశాలలో నియమించినట్లు ఆమె తెలిపారు. డిఈఓ సమక్షంలో వీరికి నియామక పత్రాలను అందిస్తామని పేర్కొన్నారు.