సంగారెడ్డి: 22వ వార్డులో వార్డు సభ

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం 22వ వార్డులోని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివాసంలో వార్డు సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, గృహజ్యోతి వంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పథకాలు అమలు కానివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్