సర్దార్ సర్వాయి పాపన్న 361వ వర్ధంతి సందర్భంగా, ఆయన నిర్మించిన కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ కూడా పాల్గొన్నారు. పాపన్న వారసత్వాన్ని గౌరవిస్తూ, ఆయన నిర్మించిన చారిత్రక కట్టడాలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.