సంగారెడ్డి పట్టణ శివారుని శ్రీ వైకుంఠాపురంలో వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు. కళ్యాణోత్సవ ఘట్టాలను భక్తులకు వివరించారు. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ పెద్ద ఎత్తున నామస్మరణ చేశారు.