సంగారెడ్డి: తడి, పొడి, హానికర చెత్త వేరువేరుగా వేయాలి

సంగారెడ్డి మున్సిపాలిటీలో తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త వేరువేరుగా చెత్త బండిలో వేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని చెప్పారు. సంపూర్ణ పారిశుద్ధ్య మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్