సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్ లో సోమవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు.