జూన్ రెండవ తేదీన చేయూత పింఛన్ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య ప్రశ్నించారు. గురువారం సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ, అబద్దాలతో పెన్షన్ దారులను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా దివ్యాంగుల పెన్షన్ 5 వేలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.