సంగారెడ్డి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా

సంగారెడ్డి జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతన జీవో తెచ్చి జర్నలిస్టుల హక్కులను కాలరాస్తుందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సాయినాథ్, ఉపాధ్యక్షుడు వీరేందర్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి సునీల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్