ప్రమాదానికి కారణమైన సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఎంఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్, హెచ్ఎంఎస్ జిల్లా కార్యదర్శి ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతూ యజమాన్య నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.