సంగారెడ్డి: కార్మికులకు చట్టాలపై అవగాహన ఉండాలి

మే డే సందర్భంగా శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, కార్మికులు తమకు ఉన్న చట్టాలు, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 1886 పోరాట స్ఫూర్తితో ఏటా మే 1న ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్