సంగారెడ్డిలో సదరం శిబిరాల షెడ్యూల్ విడుదల

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మార్చి నెలకు సంబంధించిన 'సదరం' శిబిరాల షెడ్యూల్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 4, 11, 18, 25 తేదీల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని, నిర్ణీత తేదీల్లో ఉదయాన్నే ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమతో పాటు తగు ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్