అదుపు తప్పిన స్కూల్ బస్సు.. 18 మంది విద్యార్థులకు గాయాలు

చౌటకూర్ మండలం చక్రియాల్ శివారులో ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్, యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్