జొన్నల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి.. కిసాన్ సంఘం

సంగారెడ్డి జిల్లాలో భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, ఎకరానికి 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు శ్రీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్  కి వినతి పత్రం సోమవారం సమర్పించారు. కొనుగోలు చేసిన శనగలకు వెంటనే బిల్లులు చెల్లించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాల విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, మురళీధర్ రెడ్డి, మొగులయ్య, మల్లన్న, శశి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్