ఆషాడ మాసం పురస్కరించుకొని న్యాల్కల్ మండల పరిధిలో ఉన్నటువంటి తాట్ పల్లి భవానీ మాత అమ్మవారి బోనాల పండుగను గ్రామ ప్రజలు అంగరంగా వైభవంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాలు, దీప దూప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆడపడుచులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.