ఉపాధ్యాయ వృత్తి సమాజానికి ఆదర్శం అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. పీచేర్యాగడి జడ్పిహెచ్ఎస్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పట్లోళ్ల సురేష్ ఉద్యోగ విరమణ అభినందన సభను సంగారెడ్డి జెఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహించారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకు ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా పట్లోళ్ల సురేష్ ను శాలువాతో సన్మానించారు.