ఇప్పలగడ్డ తాండలో శ్రీ పౌరదేవి జగదాంబ ఆలయ వార్షికోత్సవం వైభవం

సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది మండలం ఇప్పలగడ్డ తాండ గ్రామంలో శ్రీ పౌరదేవి జగదాంబ దేవాలయ 19వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. పూజలు, భజనలతో గ్రామం మార్మోగింది. గ్రామ సర్పంచ్ నేనావత్ సోని రాజు మాట్లాడుతూ, అందరి సహకారంతో వేడుకలు ఘనంగా నిర్వహించామని, రామ్ రావు మహారాజ్ బోధనలతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని తెలిపారు. ఆలయ పూజారి బిక్య నాయక్, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్