వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహులు, సంగారెడ్డి మండలం నాగపూర్ గ్రామంలో వ్యవసాయ కూలీలతో సమావేశమయ్యారు. ఉపాధి హామీ పథకానికి మూడు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. విబిజి రాంజి చట్టం పేరుతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.