పోస్టల్ నుంచి కాకుండా బ్యాంకుల ద్వారా ఉపాధి హామీ కూలీ చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు మొదటగా వ్యవసాయ కూలీలకు ఇవ్వాలని కోరారు.