పోలీసు శాఖలో అదనపు ఎస్పీ సంజీవరావు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. అదనపు ఎస్పీ సంజీవరావు ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉద్యోగ విరమణ ఉంటుందని చెప్పారు. అదనపు ఎస్పీని పోలీసుశాఖ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.