జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 24 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ చెన్నూరి రూపేష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే వీరిని బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన ఎస్సైలు వెంటనే వారికి కేటాయించిన పోలీస్ స్టేషన్లలో విధుల్లో చేరాలని సూచించారు.