సంగారెడ్డి: టిఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేయాలి

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి కోరారు. సంగారెడ్డి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గం నుంచి పదివేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలను తరలిస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్