టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

కొండాపూర్ మండలం మల్కాపూర్ లోని గోకుల్ ఫంక్షన్ హల్ లో టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ వాల్ పోస్టర్ ను సోమవారం ఆవిష్కరించారు. ఈ నెల 9న సంగారెడ్డి టీఎన్జీవోస్ భవన్ లో నిర్వహించనున్న మహాసభకు జర్నలిస్టు సభ్యులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు రామప్ప, జర్నలిస్టులు మాణిక్యం, మహేష్ కుమార్, రవి, నర్సింలు, ప్రేమనందం, శ్రీకాంత్ రెడ్డి, శ్యామ్, బాల్ రాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్