సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఏబీఎన్ రెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఉద్యోగులకు మద్దతు తెలిపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జాయింట్ సెక్రటరీ శేషాద్రి, అధ్యక్షుడు దత్తు పాల్గొన్నారు.