మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీటు నోటీసుకు నిరసనగా, ఆదివారం సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సీనియర్ నాయకులు రాజేందర్, వెంకటేశ్వర్లు, మల్లా గౌడ్, ప్రభాకర్, జీవీ శ్రీనివాస్ పాల్గొన్నారు.