సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ భవన్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. ప్రభుగౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 వంటి పథకాలను, అలాగే సంగారెడ్డి జిల్లాకు ఐఐటీ, సింగూరు జలాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం వంటి అభివృద్ధి పనులను ఆయన గుర్తు చేసుకున్నారు.