జహీరాబాద్ మండలం, హుగ్గెల్లి గ్రామంలో గురువారం అంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏహెచ్‌టీయూ ఎస్ఐ లాల్ అహ్మద్, మాణిక్ రెడ్డి లు మానవ అక్రమ రవాణా, కార్మికుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, ఈవ్ టీజింగ్, అవయవాల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక దాడులు, సైబర్ స్టాకింగ్, సైబర్ బులీయింగ్, సైబర్ మోసాలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.