జహీరాబాద్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మంచినీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ, కనీస వసతులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి మహిపాల్, నాయకులు పాల్గొన్నారు.