వరకట్నం వేధింపుల కేసులో అదనపు డిస్ట్రిక్ట్ స్పెషల్ జడ్జి కృష్ణార్జున బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. బీహెచ్ఈఎల్‌కు చెందిన ఉమారాణిని ఇంద్రకరణ్ చెందిన ప్రభుకు ఇచ్చి వివాహం చేశారు. అదనపు కట్నం కోసం భర్త ప్రభు వేధించడంతో మనస్థాపానికి గురైన ఉమారాణి, 19 జనవరి 2016న అత్తగారింట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో, నిందితుడైన ప్రభుకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.