సంగారెడ్డి: లవ్ మ్యారేజ్.. తల్లి ఆత్మహత్యాయత్నం

పటాన్‌చెరు మండలంలోని రుద్రారంలో బుధవారం రాత్రి వసంత అనే మహిళ తన పెద్ద కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నాడనే మనస్తాపంతో ఫ్లోర్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు గమనించి ఆమె భర్త రమేష్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆమెను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

సంబంధిత పోస్ట్