సంగారెడ్డి: పూజారి గంజాయి సాగు.. పోలీసుల అదుపులో గురువు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామంలో గుడి పూజారి నాగయ్య మహారాజ్, ఆలయ భూముల్లో గంజాయి సాగు చేస్తూ ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడ్డాడు. భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేయాల్సిన పూజారి, గంజాయి సాగు చేసి, ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ గ్రామంలో పంట చేన్లలో గంజాయి సాగు చేయడం పరిపాటిగా మారింది. డీటీఎఫ్ సీఐ దుబ్బాక శంకర్ నేతృత్వంలో ఎస్సైలు హన్మంత్, అనుదీప్, సిబ్బంది దేవాలయం ప్రాంగణంలో బంతిపూల తోటలో గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్