ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షాక్… రైతు మృతి

వెల్దుర్తి మండలం కుకునూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బోరు మోటార్ మరమ్మతు కోసం ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లిన రైతు గ్యారెళ్ళ పోచయ్య విద్యుత్ షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆయన గురువారం మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోచయ్య మృతితో ఆయన కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్