సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా కలెక్టరేట్ వెనుక ఉన్న పట్టణ ప్రకృతి వనంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. వాకింగ్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసిన సిమెంట్ బేంచీలను వారు ధ్వంసం చేశారు. గతంలోనూ ఇలాంటి సంఘటన జరిగిందని, అప్పుడు పట్టుబడిన దుండగులతో బేంచీలు వేయించారని వాకర్స్ తెలిపారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు స్పందించి దుండగులను పట్టుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.