కర్చల్ గ్రామంలో కుస్తీ పోటీలు: వెండి కడియాలు బహుమతిగా

రాయికోడ్ మండల పరిధిలోని కర్చల్ గ్రామంలో జనవరి 28 నుండి శ్రీ హజరత్ షానురే ఇమామ్, శ్రీ హజరత్ సయ్యద్ యాదుల్లా హుస్సేని ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు మధ్యాహ్నం 2 గంటల నుండి కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ ఊర్మిళ శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు రుక్మోద్దీన్ తెలిపారు. చివరి రెండు కుస్తీ పోటీలలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా 4.5 తులాల వెండి కడియం, రెండవ బహుమతిగా 5 తులాల వెండి కడియం అందజేస్తామని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్