సైబర్ నేరాలపై రెజింతల్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం

న్యాల్కల్ మండలం రెజింతల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ జాగృత దినోత్సవం సందర్భంగా బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, వ్యక్తిగత సమాచారం ఎవరికీ చెప్పవద్దని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను నమ్మవద్దని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్