జహీరాబాద్ ప్రభుత్వ వైద్యశాలలో నెలకొన్న సమస్యలపై భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ నాయకులు స్థానిక ఇన్చార్జ్ డాక్టర్ కిరణ్ ని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకపోవడంతో నిరసనగా ఖాళీ కుర్చీకి వినతిపత్రాన్ని అందజేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.