స్వచ్ఛతే సంకల్పం పరిశుభ్రతే లక్ష్యం - సర్పంచ్ ప్రియాంక రాజేందర్

జహీరాబాద్ నియోజకవర్గంలోని గురుజువాడ గ్రామంలో సర్పంచ్ ప్రియాంక రాజేందర్ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రధాన రహదారులు, పరిసర ప్రాంతాలను పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి శుభ్రం చేయించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్లపై వేయకుండా పంచాయతీ సిబ్బందికి సహకరించాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమం 'స్వచ్ఛతే సంకల్పం, పరిశుభ్రతే లక్ష్యం' నినాదంతో జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕