జహీరాబాద్ మండల పరిధిలోని హోతి-కే లోని కేజీవీబీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీఓ రాంరెడ్డి, ఏమార్వో దశరథ్ కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడి వంట గదిని, స్టోర్ రూమ్లను, తరగతి గదిలోని విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రావిణ్య భోజనం చేశారు.