ప్రశ్నించే గొంతుకల అణచివేతే కాంగ్రెస్ లక్ష్యం: హరీశ్ రావు

మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, బీఆర్ఎస్ నేతలపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా, క్రిశాంక్ను అరెస్ట్ చేయడం అన్యాయమని ఆయన అన్నారు. ఇది రాజకీయ కక్షసాధింపేనని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరుపై న్యాయపరంగా పోరాటం చేస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్