అంగ వైకల్యం శరీరానికే, మనోధైర్యానికి కాదు: నర్సింలు

జహీరాబాద్ పట్టణంలోని కె పెతినిక్ హోటల్ లో కొనిటీ నర్సింలు ఎం.ఏ (తెలుగు), ఎల్.ఎల్.బి పూర్తి చేసిన సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బీసీ జేఏసీ జహీరాబాద్ చెర్మెన్ డా.పెద్ద గొల్ల నారాయణ మాట్లాడుతూ, 'అంగ వైకల్యం శరీరానికే గానీ, మనోధైర్యానికి కాదు' అని నర్సింలు నిరూపించారని కొనియాడారు. చిన్నప్పటి నుంచి అంగ వైకల్యంతో బాధపడుతున్నా, నర్సింలు విద్యాప్రేమ, పట్టుదల యువతకు ఆదర్శమని, ఆయన విజయం వైకల్యం ఉన్న అనేక మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కాశింపూర్ గ్రామ ప్రజలు, బంధువులు, స్నేహితులు, సంగారెడ్డి జిల్లా ప్రజలు ఆయన ఘనతను ప్రశంసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్