కుప్పా నగర్ లో దుర్గాభవాని బోనాల వేడుకలు

ఝరాసంగం మండలం కుప్పా నగర్ గ్రామంలో దుర్గాభవాని బోనాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహిళలు తలపై బోనాలను ధరించి గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు ప్రత్యేకంగా అకట్టుకున్నాయి. దుర్గాభవాని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్