గాంధీజీ ఆశయాలే నేటి తరానికి మార్గదర్శకం: సర్పంచ్ ప్రియాంక

జహీరాబాద్ నియోజకవర్గం, కోహిర్ మండలం, గురుజువాడ గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రియాంక రాజేందర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ కీలక పాత్రను స్మరించుకున్నారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో ఐక్యత, శాంతి, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలే నేటి తరానికి మార్గదర్శకమని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕