హనుమకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో మేడారం జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు 500 మంది సిబ్బందితో అధికారులు ఈ లెక్కింపును చేపట్టారు. తొలి రోజు 125 హుండీలను లెక్కించగా రూ.2.49 కోట్ల ఆదాయం లభించినట్లు వెల్లడించారు. మొత్తం 828 హుండీలను పది రోజుల పాటు లెక్కించనున్నారు. ప్రస్తుతం హుండీల్లో వచ్చిన నగదు, చిల్లర నాణేలు, బియ్యం తదితరాలను వేర్వేరుగా వేరు చేస్తున్నారు. నాణేలు అధికంగా ఉండటంతో వాటిని ప్రత్యేకంగా లెక్కిస్తున్నారు. భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో పారదర్శకత పాటిస్తూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. హుండీల లెక్కింపు పూర్తయ్యాక మొత్తం ఆదాయ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.