న్యాల్కల్ మాజీ సర్పంచ్ మఠం శివశంకరయ్య స్వామి సోదరుడు మఠం బసయ్య స్వామి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్‌లో వారి నివాసానికి వెళ్లి, బసయ్య స్వామి చిత్రపటానికి పూలమాల వేసి మంగళవారం నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతి లక్ష్మి, ప్రవీణ్ కుమార్ వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.