న్యాల్కల్ పశువుల జాతర: రూ.5.40 లక్షల వరకు ధరలు, రైతుల ఆనందం

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పశువుల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దియోని, ఒంగోలు, కిల్లరి జాతులకు చెందిన ఎద్దులు, కోడెదూడలు, ఆవులు, పాడిగేదెలు అమ్మకానికి రాగా, ధరలు రూ.50 వేల నుంచి రూ.5.40 లక్షల వరకు పలికాయి. ఈ జాతరలో ఉత్తమ పశుపోషకులైన రైతులకు స్థానిక దివంగత అడివప్ప, గిరిజమ్మ జ్ఞాపకార్థం బహుమతులు అందజేశారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల వ్యాపారులు పాల్గొనడంతో పశువుల ధరలు పెరిగాయి. జాతర నిర్వాహణ కమిటీ భద్రత, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చక్కగా నిర్వహించింది.

సంబంధిత పోస్ట్