న్యాల్‌కల్‌లో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్‌కల్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు కలిసి మొక్కలు నాటి, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో నరేష్‌బాబు, సర్పంచ్‌ జ్యోతిలక్ష్మి–ప్రవీణ్‌ కుమార్, ఉప సర్పంచ్‌ సరోజ–ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕