న్యాల్కల్‌లో పల్స్ పోలియో: చిన్నారులకు చుక్కల పంపిణీ

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి–ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్